ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సినేషన్ ఆలస్యం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర : బీజేపీ

ABN, First Publish Date - 2021-06-17T04:57:31+05:30

కొవాగ్జిన్‌లో కోడెదూడల సీరం ఉందంటూ అపోహలు సృష్టించి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆలస్యం చేసేందుకు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొవాగ్జిన్‌లో కోడెదూడల సీరం ఉందంటూ అపోహలు సృష్టించి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆలస్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. కేంద్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ ఇప్పటికే వివరణ ఇచ్చిందనీ.. అయినప్పటికీ పదే పదే దీన్ని ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ‘‘పాపానికి’’ ఒడిగట్టిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పేర్కొన్నారు. దేశీయంగా తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ కొవాగ్జిన్‌లో కొత్తగా జన్మించిన లేగదూడల సీరం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది. వాస్తవాలను వక్రీకరించి, తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చీఫ్ గౌరవ్ పంథినుద్దేశించి సంబిత్ పాత్ర స్పందిస్తూ... ‘‘బీజేపీ ఎప్పుడూ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయదు. కొవాగ్జిన్ లేదా ఇతర ఏ వ్యాక్సీన్‌లో అయినా లేగదూడల సీరం ఉంటే.. దీని గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. వ్యాక్సిన్ అనేది ఇవాళ జీవనాడిగా మారింది. నమ్మకాలు, విశ్వాసాలు పక్కనబెట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సీన్ వేయించుకోవాలి...’’ అని పేర్కొన్నారు. కాగా ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించిన తర్వాత తాము మాట్లాడతామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-17T04:57:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising