ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాస్వామ్యం చచ్చిపోయింది

ABN, First Publish Date - 2021-02-28T09:35:56+05:30

దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘గడిచిన ఆరేళ్లుగా దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవస్థల మధ్య సమతుల్యతను ఆర్‌ఎస్‌ఎస్‌ దెబ్బతీసింది: రాహుల్‌


తూత్తుకుడి, ఫిబ్రవరి 27: దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘గడిచిన ఆరేళ్లుగా దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు, పత్రికా స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛలపై పథకం ప్రకారం దాడి జరుగుతోంది. ప్రజాస్వామ్యం ఒక్క దెబ్బకు చచ్చిపోదు. నెమ్మదిగా అంతరిస్తుంది. పార్లమెంటు, న్యాయవ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు, మీడియా వీటన్నింటి సమాహారమే దేశం. ఈ వ్యవస్థలన్నింటిలోకీ ఆర్‌ఎ్‌సఎస్‌ చొరబడింది. వాటి మధ్య సమత్యులతను ధ్వంసం చేసింది’’ అని ఆయన శనివారమిక్కడ పేర్కొన్నారు. మన వ్యవస్థలను కాపాడుకోవాల్సిన సమయమిదని చెప్పారు.


‘‘ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెడుతోంది. పుదుచ్చేరిలో ఎమ్మెల్యేలకు ఎంత డబ్బిచ్చిందో మాకు తెలుసు. భారీగా డబ్బు వెదజల్లి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో మా ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొంది’’ అని రాహుల్‌ దుయ్యబట్టారు. దేశ ప్రయోజనాలతో మోదీ రాజీపడతారని చైనాకు తెలుసని, సరిహద్దు సమస్య విషయంలో జరుగుతున్న పరిణామాలు, చైనా నుంచి పెట్టుబడులకు అనుమతులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. 

Updated Date - 2021-02-28T09:35:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising