ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయ్ రూపానీ రాజీనామాపై కాంగ్రెస్ స్పందనిదే..

ABN, First Publish Date - 2021-09-11T22:27:57+05:30

గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ శనివారంనాడు రాజీనామా చేయడంపై కాంగ్రెస్ పార్టీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ శనివారంనాడు రాజీనామా చేయడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నట్టు అసెంబ్లీలో కాంగ్రెస్ విపక్ష నేత పరేష్ ధనాని అన్నారు. గ్రామాలు, పేద ప్రజలు, రైతుల గోడు వినే ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది నెలల్లో జరగనున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విజయ్ రూపానీ రాజీనామా చేయడం సంచలనమైంది. సీఎంగా తనకు అవకాశం కల్పించినందుకు బీజేపీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన విజయ్ రూపానీ, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహించడానికి సిద్ధమేనని రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఐదేళ్ల పదవీ కాలంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు పార్టీకి సహకరిస్తూ వచ్చారని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం, కొత్త సీఎం సారథ్యంలో గుజరాత్ అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగుతుందని చెప్పారు.


విజయ్ రూపానీ  రాజీనామా నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు గాంధీనగర్‌లో సమావేశమయ్యారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ, పర్షోత్తమ్ రూపాల తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. కాగా, కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారంనాడు సమావేశమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-09-11T22:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising