ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంతున్నా సరే రుణమాఫీ చేస్తాం: రైతులకు కాంగ్రెస్ హామీ

ABN, First Publish Date - 2021-12-02T23:32:03+05:30

ఒకవైపు కొవిడ్‌ కారణంగా ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేక విమానం కొన్నారు. ఆ విమానంలో మోదీ ఒక్కరే తిరుగుతుంటారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: రైతులు తీసుకున్న మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హామీ ఇచ్చిరు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొరాదాబాద్‌లో గురువారరం నిర్వహించిన ర్యాలీలో ప్రియాంక పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ హంగు ఆర్భాటాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న మోదీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడానికి వెనకాడుతోందని విమర్శించారు.


‘‘ఒకవైపు కొవిడ్‌ కారణంగా ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేక విమానం కొన్నారు. ఆ విమానంలో మోదీ ఒక్కరే తిరుగుతుంటారు. ఇందులో సగం డబ్బు.. అంటే 4,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే రైతుల రుణమాఫీ చేయొచ్చు. అంతే కాదు. 70 ఏళ్ల నుంచి ఉన్న పార్లమెంట్‌ను కూల్చి కొత్త పార్లమెంట్ కడుతున్నారు. దీనికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇలా అనవసరమైన వాటికి వేలాది కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం రైతుల ప్రస్తావన తీయగానే మౌనం వహిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అలా చేయదు. మేం అధికారంలోకి రాగానే రైతుల మొత్తం రుణాన్ని మాఫీ చేస్తాం’’ అని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు.

Updated Date - 2021-12-02T23:32:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising