ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క‌రోనా సోకిన కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం!

ABN, First Publish Date - 2021-05-16T14:43:28+05:30

కరోనా వైరస్ సోకిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సాత‌వ్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా వైరస్ సోకిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సాత‌వ్ ఆరోగ్య‌ పరిస్థితి విషమంగా ఉందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. ఆయ‌న జల్నాలో విలేకరులతో మాట్లాడుతూ సాత‌వ్‌ నెమ్మదిగా కోలుకున్నారు. అయితే ఇంత‌లోనే అతని ఆరోగ్యం తిరిగి క్షీణించింది. ఇప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. సాత‌వ్‌కు సైటోమెగాలోవైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. కాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడ‌యిన సాత‌వ్ ఏప్రిల్ 22 న కరోనా వైరస్ బారిన పడ్డారు. 


ఆ తర్వాత ఆయన‌ పూణేలోని జహంగీర్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ సాత‌వ్  వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.  కాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభలో డిప్యూటీ కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ, పార్టీ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్, అధీర్ రంజన్ చౌదరి, శశి థ‌రూర్, భూపిందర్ సింగ్ హుడా త‌దిత‌రులు ఇటీవలే కరోనా బారిన పడ్డారు. రాజీవ్ శాత‌వ్‌ మహారాష్ట్రకు చెందిన రాజ్యసభ సభ్యుడు. 2014 ఎన్నికలలో మహారాష్ట్రలోని హింగోలి నుండి ఎన్నికయ్యారు. సాత‌వ్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి. గుజరాత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

Updated Date - 2021-05-16T14:43:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising