ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం వైఫల్యాలతో లాక్‌డౌన్‌ అనివార్యం!

ABN, First Publish Date - 2021-05-08T08:50:56+05:30

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలతోనే దేశంలో మరో జాతీయ లాక్‌డౌన్‌ దాదాపు అనివార్యమైందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చెప్పారు. లాక్‌డౌన్‌ వల్ల తలెత్తే ఆర్థిక ప్రభావానికి సంబంధించి ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపణ


న్యూఢిల్లీ, మే 7: కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలతోనే దేశంలో మరో జాతీయ లాక్‌డౌన్‌ దాదాపు అనివార్యమైందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చెప్పారు. లాక్‌డౌన్‌ వల్ల తలెత్తే ఆర్థిక ప్రభావానికి సంబంధించి ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైరస్‌ వ్యాప్తి మూలంగా తలెత్తే ప్రాణం నష్టంతో ప్రజలు విషాదకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి రాహుల్‌ శుక్రవారం లేఖ రాశారు. ఇందులో పలు ఆరోపణలు చేయడంతో పా టు ప్రభుత్వానికి కొన్ని సూచనలూ చేశారు. ప్రభుత్వానికి కొవిడ్‌, టీకా వ్యూహంపై స్పష్టమైన వ్యూహం లేకపోవడం, వైరస్‌ వ్యాప్తి ఉన్నప్పటికీ ఈ మహమ్మారిపై విజయం సాధించినట్టు ప్రకటించడమే దేశాన్ని అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంచాయన్నారు. ఇప్పుడీ వ్యాధి విస్ఫోటంలా పెరుగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌కు ప్రజలను సిద్ధం చేయాలన్నారు. నిరుడు లాక్‌డౌన్‌ వల్ల సంభవించిన అనేక ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండటానికి పకడ్బందీగా వ్యవహరించాలని కోరారు. 

Updated Date - 2021-05-08T08:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising