ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీలో చిన్న పార్టీలతోనే పొత్తు : కాంగ్రెస్

ABN, First Publish Date - 2021-09-05T20:42:58+05:30

వచ్చే ఏడాదిలో జరిగే ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : వచ్చే ఏడాదిలో జరిగే ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం వ్యూహాలను కాంగ్రెస్ సిద్ధం చేస్తోంది. కేవలం చిన్న ప్రాంతీయ పార్టీలతోనే చేతులు కలపాలని నిర్ణయించింది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ ఆదివారం ఈ విషయాన్ని చెప్పారు. 


అజయ్ ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం పెద్ద పార్టీలతో చేతులు కలపాలనే ఆలోచనే లేదన్నారు. రాష్ట్రంలో మళ్ళీ తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాలు ప్రజల నమ్మకానికి తగినట్లు పాలించడంలో విఫలమయ్యాయన్నారు. 


రానున్న శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన పోటీదారు కాంగ్రెసేనని చెప్పారు. ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ చేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. 


ఇదిలావుండగా, బీఎస్పీ, ఎస్పీ కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్‌తో పొత్తును తోసిపుచ్చుతూ వస్తున్నాయి. బీఎస్‌పీ ఒంటరిగా పోటీ చేస్తుందని మాయావతి ఇటీవల చెప్పారు. చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తెలిపారు.



Updated Date - 2021-09-05T20:42:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising