ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాట కాంగ్రెస్‌కు 25 సీట్లు

ABN, First Publish Date - 2021-03-08T07:42:48+05:30

డీఎంకే కూటమిలో కాంగ్రె్‌సకు సీట్ల కేటాయింపు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఆ పార్టీకి 25 శాసనసభ స్థానాలతో పాటు కన్నియాకుమారి లోక్‌సభ స్థానాన్ని కూడా డీఎంకే ఖరారు చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కన్యాకుమారి లోక్‌సభ స్థానం కూడా..
  • ఎట్టకేలకు డీఎంకేతో కుదిరిన ఒప్పందం


చెన్నై, మార్చి 7(ఆంధ్రజ్యోతి): డీఎంకే కూటమిలో కాంగ్రె్‌సకు సీట్ల కేటాయింపు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఆ పార్టీకి 25 శాసనసభ స్థానాలతో పాటు కన్నియాకుమారి లోక్‌సభ స్థానాన్ని కూడా డీఎంకే ఖరారు చేసింది. ఈ మేరకు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి ఆదివారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అళగిరి విలేకరులతో మాట్లాడుతూ.. సీట్ల సర్దుబాటుపై తాము సంతోషంగానూ, సంతృప్తిగానూ ఉన్నట్లు ప్రకటించారు. మతతత్వ బీజేపీ కూటమిని మట్టి కరిపించేందుకు తమ పార్టీ నేతలు శాయశక్తులా కృషి చేస్తారని చెప్పారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని డీఎంకేను అడగబోమని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 41 స్థానాలు పొందిన కాంగ్రెస్‌.. 8 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఆ కారణంగానే డీఎంకే అధికారానికి దూరమైందని ఆ పార్టీలు నేతలు భావిస్తున్నారు.


Updated Date - 2021-03-08T07:42:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising