ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది కల మాత్రమే: మమత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్

ABN, First Publish Date - 2021-12-02T02:42:16+05:30

దీనికి ముందు శరాద్ పవార్‌ను కలిసిన అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘‘యూపీఏ ఏంటి..? అదెక్కడుంది..? ఇక్కడైతే అలాంటిదేమీ లేదు’’ అని అన్నారు. వాస్తవానికి ఆమె ముంబైలో ఎన్సీపీ, శివసేన నేతలను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: యూపీఏ లేదంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. దేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఓడించాలని అనుకోవడం కలలు కనడం లాంటిదని ఎద్దేవా చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం మమత వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు.


‘‘భారత రాజకీయాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా బీజేపీని ఓడించడం అంటే అది కల మాత్రమే’’ అని కేసీ వేణుగోపాల్ అన్నారు. దీనికి ముందు శరాద్ పవార్‌ను కలిసిన అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘‘యూపీఏ ఏంటి..? అదెక్కడుంది..? ఇక్కడైతే అలాంటిదేమీ లేదు’’ అని అన్నారు. వాస్తవానికి ఆమె ముంబైలో ఎన్సీపీ, శివసేన నేతలను కలుసుకున్నారు. ఈ రెండు పార్టీలో కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్రలో అధికారాన్ని పంచుకున్నాయి. పైగా కొద్ది రోజుల ముందు వరకు కాంగ్రెస్ నేతృత్వంలోనే బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పడుతుందన్నట్లుగా వ్యవహరించిన శరద్ పవార్.. తాజాగా యూపీఏ లేదంటూ మమత వ్యాఖ్యానించిన సందర్భంలో ఆమె పక్కనే ఉండడం గమనార్హం. పైగా శరద్ పవార్‌తో సమావేశం అనంతరమే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇది పవార్ గేమని కొంత మంది నెటిజెన్లు అంటున్నారు.

Updated Date - 2021-12-02T02:42:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising