ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madhya Pradesh: కొవిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలులో అక్రమాలు: కాంగ్రెస్

ABN, First Publish Date - 2021-07-28T16:45:42+05:30

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ విరుచుకుపడింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదించని కొవిడ్ టెస్టింగ్ కిట్లను దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభఉత్వం దక్షిణ కొరియా కంపెనీ రాప్గిన్ ఇంక్ నుంచి బయో క్రెడిట్ కొవిడ్ ఏజీ అనే కొవిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసింది. ఈ టెస్టింగ్ కిట్లకు ఐసీఎంఆర్ ఆమోదం లేదని కాంగ్రెస్ పేర్కొంది.ఈ కొనుగోళ్ల ద్వారా బీజేపీ సర్కారు అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది.


‘‘దక్షిణ కొరియా వస్తు సామగ్రిని కొనవద్దని ప్రధాని అన్నారు, అయితే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లి వాటిని కొనుగోలు చేసింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనాతో పోరాడుతున్నారా లేదా అనేది నేను ప్రశ్నించాలనుకుంటున్నాను’’ అని కాంగ్రెస్ నాయకుడు జితు పట్వారీ చెప్పారు. అక్రమాలకు పాల్పడిన బీజేపీని రాష్ట్రప్రజలు ఖచ్చితంగా శిక్షిస్తారని పట్వారీ చెప్పారు. దక్షిణ కొరియా నుంచి రూ.7.18 కోట్లకు టెస్టింగ్ కిట్లను కొన్నారని పట్వారీ చెప్పారు. దక్షిణ కొరియా కిట్ లలో నాణ్యత లేదని కొవిడ్ అధికారుల బృందం అధిపతి డాక్టర్ కేకే అగర్వాల్ రాష్ట్రపరిపాలన అధికారులకు లేఖ రాశారు.


Updated Date - 2021-07-28T16:45:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising