ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లెఫ్ట్‌తో కుదిరిన ఒప్పందం.. కాంగ్రెస్‌కు 92 సీట్లు

ABN, First Publish Date - 2021-03-02T02:08:29+05:30

ఈ విషయమై వామపక్ష పార్టీలు కాంగ్రెస్ మధ్య అనేక చర్చలు జరిగాయి. అయితే ఎట్టకేలకు పాత ఒప్పందానికి కాంగ్రెస్ ఒప్పుకుంది. మళ్లీ 92 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. ఇక ఈ కూటమిలో పెద్ద వాటాదారుగా సీపీఎం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకం ఎట్టకేలకు ముగిసింది. 294 స్థానాలున్న బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి 92 స్థానాలు వచ్చినట్టు.. కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదురి సోమవారం ప్రకటించారు. మిగిలిన 202 స్థానాల్లో వామపక్ష పార్టీలన్నీ పోటీ చేయనున్నాయి. సీట్ల పంపకాలపై చాలా రోజులుగా చర్చలు జరిగిన తర్వాత ఇరు వర్గాలు ఒక ఒప్పందానికి వచ్చాయి.


ఈ విషయమై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదురి మాట్లాడుతూ ‘‘వామపక్ష పార్టీలతో చర్చలో కుదిరిన ఒప్పందం ప్రకారం.. రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 92 స్థానాల్లో పోటీ చేయబోతోంది. ఈ స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను రెండు రోజుల్లో విడుదల చేస్తాం’’ అని అన్నారు.


2016 ఎన్నికలకు ఈసారి ఎన్నికలకు వామపక్ష, కాంగ్రెస్ పార్టీల సీట్ల పంపకాల్లో ఎలాంటి తేడా లేదు. 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 92 స్థానాల్లోనే పోటీ చేసింది. అయితే వామపక్ష పార్టీల కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. 202 స్థానాల్లో పోటీ చేసిన వామపక్షాలు కేవలం 35 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ 44 స్థానాల్లో గెలుపొంది బెంగాల్‌లో ప్రతిపక్షంగా అవతరించింది. తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తమకు గతంలో కంటే ఎక్కువ స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.


ఈ విషయమై వామపక్ష పార్టీలు కాంగ్రెస్ మధ్య అనేక చర్చలు జరిగాయి. అయితే ఎట్టకేలకు పాత ఒప్పందానికి కాంగ్రెస్ ఒప్పుకుంది. మళ్లీ 92 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. ఇక ఈ కూటమిలో పెద్ద వాటాదారుగా సీపీఎం ఉంది. గతంలో 148 స్థానాల్లో పోటీ చేసిన సీపీఎం.. కేవలం 26 స్థానాలు మాత్రమే గెలిచి మూడో స్థానానికి పరిమతమైంది. అయితే 2016 ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉన్న వామపక్ష-కాంగ్రెస్ కూటమికి.. ఈసారి ఎన్నికల్లో అంత ప్రాధాన్యత లేదనే చెప్పాలి. టీఎంసీకి పోటీగా ప్రధాన పోటీగా భారతీయ జనతా పార్టీ ఎదిగింది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో 18 ఎంపీ స్థానాలు గెలిచి అసెంబ్లీ పోరులో మమతా బెనర్జీకి సవాల్ విసురుతోంది.

Updated Date - 2021-03-02T02:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising