ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్ నేత దారుణ హత్య.. ఆస్పత్రి వద్ద అనుచరుల బీభత్సం..

ABN, First Publish Date - 2021-03-17T20:58:28+05:30

మధ్య ప్రదేశ్‌లోని ఛతార్పూర్ జిల్లాలో స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఛతార్పూర్: మధ్య ప్రదేశ్‌లోని ఛతార్పూర్ జిల్లాలో స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు. మృతుడు 45 ఏళ్ల ఇంద్ర ప్రతాప్ సింగ్ పర్మార్‌ ప్రస్తుతం గువారా బ్లాక్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన హత్యపై ఛత్తార్పూర్ ఎస్పీ లోకేంద్ర సింగ్ మాట్లాడుతూ... ‘‘ఇంద్ర పరతాప్ సింగ్ బాదమల్హారాలోని ఓ హోటర్ వద్ద ఉండగా.. దాదాపు ఆరుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై అక్కడికి వచ్చారు. అందరూ చూస్తుండగానే ఆయనపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు గుర్తించారు...’’ అని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో మొత్తం 6 వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాట చేశామనీ... త్వరలోనే వారిని పట్టుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో గుర్తించామనీ.. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడవుతాయని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రతాప్ సింగ్ హత్యపై తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన అచరులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రిని ధ్వంసం చేసి అల్లర్లు సృష్టించారు. సీసీటీవీ ఫూటేజి ఆధారంగా అల్లర్లు సృష్టించిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

Updated Date - 2021-03-17T20:58:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising