ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ కండోమ్‌కు లింగ వివక్ష లేదు!

ABN, First Publish Date - 2021-12-04T06:29:20+05:30

మగవారికి కండోమ్స్‌ ఉన్నాయి! కాలక్రమంలో మహిళలు వాడే కండోమ్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇలా వేర్వేరుగా కాకుండా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మగవారికి కండోమ్స్‌ ఉన్నాయి! కాలక్రమంలో మహిళలు వాడే కండోమ్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇలా వేర్వేరుగా కాకుండా.. పురుషులైనా, మహిళలైనా వాడగలిగేలా కండోమ్స్‌ ఉంటే? మలేసియాకు చెందిన జాన్‌ టాంగ్‌ అనే గైనకాలజిస్టుకు వచ్చిందీ ఐడియా. దీంతో తన ఆలోచనపై దృష్టి పెట్టి.. ప్రపంచంలోనే తొలిసారిగా స్త్రీ, పురుషులిద్దరూ ధరించే వీలుండే ‘యూనిసెక్స్‌’ కండోమ్‌ను టాంగ్‌ రూపొందించారు. దీన్ని వండర్‌లీఫ్‌ యూనిసెక్స్‌ కండోమ్‌ పేరుతో పిలుస్తున్నారు. దీనిపైభాగంలో ఉండే ఎడ్‌హెసివ్‌ ఫ్లాప్స్‌ వల్ల.. మామూలు కండోమ్స్‌తో పోలిస్తే సుఖవ్యాధుల నుంచి మరింత ఎక్కువ రక్షణ కల్పిస్తాయని టాంగ్‌ చెబుతున్నారు. సాధారణ కండోమ్స్‌ లేటెక్స్‌తో తయారుచేస్తారు. కానీ, కొందరికి లేటెక్స్‌ ఎలర్జీ ఉండడంతో వాటిని వాడలేరు. ఈ యూనిసెక్స్‌ కండోమ్‌ను పాలీయురేథేన్‌తో తయారుచేయడం అలాంటివారు దీన్ని నిరభ్యంతరంగా వాడుకోవచ్చని టాంగ్‌ వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ కండోమ్‌ మలేసియావారికి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విక్రయించనున్నారు.

Updated Date - 2021-12-04T06:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising