ఫోర్జరీ పత్రాలతో పోటీచేసి ఎంపీలుగా గెలిచారు
ABN, First Publish Date - 2021-10-21T08:15:24+05:30
షెడ్యూల్డు కులాల(ఎస్సీ)కు రిజర్వ్ చేయబడిన లోక్‌సభ స్థానాల నుంచి ఓ కేంద్ర మంత్రి సహా ఐదుగురు...
కేంద్రమంత్రి సహా ఐదుగురిపై జీతన్‌రామ్ ఆరోపణలు
న్యూఢిల్లీ, అక్టోబరు 20: షెడ్యూల్డు కులాల(ఎస్సీ)కు రిజర్వ్ చేయబడిన లోక్‌సభ స్థానాల నుంచి ఓ కేంద్ర మంత్రి సహా ఐదుగురు ఎంపీలు ఫోర్జరీ చేసిన ధ్రువపత్రాలతో పోటీ చేశారని బిహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మిత్రపక్షం హిందుస్థానీ ఆవామ్ మోర్చాకు జీతన్ రామ్ మాంఝీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయినప్పటికీ బీజేపీ ఎంపీలపైనా ఆయన ఆరోపణలు చేయడం గమనార్హం. బుధవారం ఆయన ఢిల్లీలోని తమ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్, బీజేపీ ఎంపీ జైసిద్ధేశ్వర్ శివాచార్య మహాస్వామీజీతో పాటు కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ సదీక్, టీఎంసీ ఎంపీ అపరూప పొద్దార్, స్వతంత్ర ఎంపీ నవనీత్ రవి రాణా ఎస్స్చీకు రిజర్వ్ చేయబడిన లోక్‌సభ స్థానాల నుంచి ఫోర్జరీ ధ్రువపత్రాలతో ఎన్నికల బరిలో నిలిచి గెలిచారని చెప్పారు. మరోవైపు, వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన గురించి ప్రస్తావిస్తూ జీతన్ రామ్ మాంఝీ వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
Updated Date - 2021-10-21T08:15:24+05:30 IST