ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమర్షియల్ గ్యాస్... ధర పెరిగింది...

ABN, First Publish Date - 2021-12-01T21:48:00+05:30

కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం స్(ఎల్‌పీజీ) సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం స్(ఎల్‌పీజీ) సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఈ రోజు(డిసెంబరు ఒకటి, బుధవారం) నుండి రూ. 103.50   పెరిగింది.  ఈ కేటగిరీకి చెందిన ఎల్‌పీజీ వంటగ్యాస్‌ ధరల పెరుగుదల నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గతనెల ఒకటిన కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లపై రూ. 266 పెరిగిన విషయం తెలిసిందే. ఈ నెల మరో రూ. 103.50 పెంచింది. తాజా ధరల పెంపు అనంతరం కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ. 2,101, ముంబైలో రూ. 2,051, కోల్‌కతాలో రూ. 2,174.50, , చెన్నైలో రూ. 2,234.50 కి పెరిగింది. అంతకుముందు నవంబరు ఒకటో తేదీన కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. అంతకుముందు అక్టోబరు 15 న పెరిగింది.


కాగా... 14.2 కిలోలు, 5 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. అంటే... గృహ వినియోగదారులకు తాజా భారం  నుంచి మినహాయింపు లభించినట్లైంది. గృహావసరాల కోసం వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ల రేట్లను యధాతథంగా కొనసాగిస్తోంది. పెంచిన రేట్లు ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి అమల్లోకొచ్చాయి. ఈ రెండు నెలల కాలంలో 19 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ. 369.50 పెరిగింది. ఈ ఏడాది మొదట్లో రూ. 694 గా ఉన్న గృహావసర ఎల్‌పీజీ వంటగ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 900 మార్క్‌ను దాటింది. కాగా... ఈ నెల 6వ తేదీన డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ల ధరలను పెంచే అవకాశముందని వినవస్తోంది. 

Updated Date - 2021-12-01T21:48:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising