ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొగ్గు సంక్షోభాన్ని ఆషామాషీగా తీసుకోవద్దు: డిప్యూటీ సీఎం

ABN, First Publish Date - 2021-10-11T00:49:47+05:30

దేశంలో బొగ్గు సంక్షోభం పొంచి ఉన్నందున కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: దేశంలో బొగ్గు సంక్షోభం పొంచి ఉన్నందున కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, బొగ్గు సంక్షోభంతో పరిశ్రమలతో పాటు ప్రతీదీ నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోని పక్షంలో దేశం ముంగిట మరో సంక్షోభం తలెత్తక తప్పదని అన్నారు.


''దేశంలో ఆక్సిజన్ సంక్షోభం తలెత్తినప్పుడు కూడా కేంద్రం ఇలాగే చేసింది. సమస్య ఉందనే విషయాన్ని ఒప్పుకోవడానికి కూడా వారు సిద్ధంగా లేరు. బొగ్గు సంక్షోభం లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ చెబుతున్నారు. దీనిపై ప్రధానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాసి ఉండకూడదని ఆయన అంటున్నారు. ఒక కేంద్ర మంత్రి ఇంతటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం చాలా విచారకరం'' అని సిసోడియా అన్నారు. దీనికి ముందు, దేశంలో బొగ్గు నిల్వలు తగ్గడానికి నాలుగు కారణాలు ఉన్నాయని కేంద్ర పేర్కొంది. విద్యుత్తుకు అనూహ్యంగా డిమాండ్ పెరగడం, భారీ వర్షాలు, దిగుమతి చేసుకునే బొగ్గు ధర పెరగడం, వర్షాకాలానికి ముందు తగిన స్థాయిలో బొగ్గును నిల్వ చేసుకోకపోవడం వల్ల ప్రస్తుత పరిస్థితి వచ్చిందని విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2021-10-11T00:49:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising