ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సహకరించండి ప్లీజ్‌ !

ABN, First Publish Date - 2021-08-03T13:07:16+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమై మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌ పరిస్థితి తీసుకురావద్దని రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సచివాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌ పరిస్థితి వద్దు

- ప్రజలకు సీఎం స్టాలిన్‌ విజ్ఞప్తి


ప్యారీస్‌: కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమై మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌ పరిస్థితి తీసుకురావద్దని రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సచివాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కంటికి కనిపించని మహమ్మారి కరోనా గత 18 నెలలుగా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోందని, దీని బారిన పడి లక్షలాదిమంది మరణించారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, ముందు జాగ్రత్త చర్యల కింద వైద్యులు, నర్సులు అంకితభావంతో అందించిన సేవల వల్ల వైరస్‌ ఉధృతి రాష్ట్రంలో తగ్గు ముఖం పట్టిందని, అయినప్పటికీ, పూర్తిస్థాయిలో ఈ వైరస్‌ నివారించలేని పరిస్థితి నెలకొందని, ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడి మళ్లీ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందేందుకు కారణం కారాదని సీఎం అ ప్రకటనలో సూచించారు. కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చినప్పటికీ, దానిని ఎదుర్కోగలిగిన శక్తి ప్రభుత్వానికి వుందని, అందుకు సంబంధించిన అన్ని వసతులు అందు బాటులో వున్నాయని, అంతమాత్రాన ప్రజలు అజాగ్రత్తగా వుండకుండా కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-08-03T13:07:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising