ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నీట్‌’పై ముసాయిదా చట్టాన్ని తక్షణం రాష్ట్రపతికి పంపండి

ABN, First Publish Date - 2021-11-28T16:01:27+05:30

‘నీట్‌ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన ముసాయిదా చట్టాన్ని తక్షణం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లులో జాప్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- గవర్నర్‌కు సీఎం విజ్ఞప్తి

- వరదలు, కొవిడ్‌ పరిస్థితులపై వివరణ

- ఆర్‌ఎన్‌ రవితో భేటీ అయిన స్టాలిన్‌


చెన్నై: ‘నీట్‌ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన ముసాయిదా చట్టాన్ని తక్షణం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లులో జాప్యం జరిగేకొద్దీ రాష్ట్ర విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లుతుందని ఈ సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌, ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, వైద్య, ఉన్నత విద్యాశాఖల కార్యదర్శులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి.. గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతలు సుదీర్ఘకంగా వివిధ అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా నీట్‌తో రాష్ట్ర విద్యార్థులకు వాటిల్లే నష్టం గురించి సీఎం వివరించారు. తమ ప్రభుత్వం రాగానే నీట్‌లోని లోటుపాట్లు, దానివల్ల విద్యార్థులకు కలిగే నష్టాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి తేల్చేందుకు జస్టిస్‌ ఏకే రాజన్‌ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించిన రాజన్‌ కమిటీ.. ఆ నివేదికను తమకు అందించిం దన్నారు. ఆ కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా రాష్ట్ర శాసనసభ గత సెప్టెంబరు 13వ తేదీన నీట్‌ను రద్దు చేయాలని కోరుతూ ముసాయిదా బిల్లును ఆమోదించి పంపామని గుర్తు చేశారు. అసెంబ్లీ ఆమోదించిన ముసాయిదా బిల్లును వెంటనే రాష్ట్రపతికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వినతిని విన్న గవర్నర్‌... పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా రాష్ట్రంలో వరుసగా వచ్చి పడుతున్న భారీ వర్షాలతో జరిగిన నష్టం గురించి, ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి కూడా ఈ సందర్భంగా సీఎం గవర్నర్‌కు వివరించారు. అదే విధంగా కేంద్రబృందం రాష్ట్రానికి వచ్చి వరద బాధిత జిల్లాలను పరిశీలించడంపై సీఎం వివరిస్తూ.. కేంద్రంతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా రాష్ట్రానికి నష్టపరిహారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొవిడ్‌ టీకాల పంపిణీమీద, మునుముందు ఎదుర్కోవాల్సిన పరిస్థితు లపైనా సీఎం, గవర్నర్‌, ఉన్నతాధి కారు ల మధ్య చర్చకు వచ్చింది. 

Updated Date - 2021-11-28T16:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising