ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిహార్‌లో విచ్చలవిడిగా మద్యం: స్పందించిన సీఎం

ABN, First Publish Date - 2021-11-22T22:10:06+05:30

అయితే ఆయన ముక్తాయింపుగా స్పందించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్నట్లుగా.. రాష్ట్ర పోలీసులకు మద్యం పట్టుబడితే చర్యలు తీసుకుంటారని చెప్పుకొచ్చారు. సోమవారం ఈ విషయమై పాట్నాలో మీడియాతో బిహార్ సీఎం నితీష్ మాట్లాడుతూ ‘‘పెళ్లి వేడుకలో మద్యం సరఫరా గురించి పోలీసులకు సమాచారం అందింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: మద్యపాన నిషేధం ఉన్న బిహార్‌లో మద్యానికి కొదువేం లేదు. కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో.. మద్యపానంపై నిషేధం లేని కొన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ మొత్తంలో బిహార్‌లో మద్యం సరఫరా కొనసాగుతోందని రిపోర్ట్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టే కాకుండా బిహార్‌లో మద్యం సరఫరాపై బహిరంగ చర్చలో కూడా అనేక వాస్తవాలు భయటపడుతూనే ఉన్నాయి. అయితే వీటిపై నితీష్ కుమార్ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. తాజాగా ఓ పెళ్లిలో పెద్ద మొత్తంలో భయపడడంతో రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ప్రతిపక్షాలు, మీడియా సహా ప్రభుత్వాన్ని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మద్యపాన సరఫరాపై సీఎం నితీష్ కుమార్ స్పందించక తప్పలేదు.


అయితే ఆయన ముక్తాయింపుగా స్పందించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్నట్లుగా.. రాష్ట్ర పోలీసులకు మద్యం పట్టుబడితే చర్యలు తీసుకుంటారని చెప్పుకొచ్చారు. సోమవారం ఈ విషయమై పాట్నాలో మీడియాతో బిహార్ సీఎం నితీష్ మాట్లాడుతూ ‘‘పెళ్లి వేడుకలో మద్యం సరఫరా గురించి పోలీసులకు సమాచారం అందింది. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగినట్లు పోలీసులకు తెలిస్తే వారు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. అయితే మద్యం కొనుగోల్లు, అమ్మకాలతో పాటు వాటి సరఫరాతో సంబంధం లేని వారు దిగులు చెందాల్సిన అవసరం లేదు’’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-11-22T22:10:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising