ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీధుల్లో తిరిగే పశువుల మేతకు నిధులిచ్చిన నవీన్ పట్నాయక్

ABN, First Publish Date - 2021-06-04T01:08:54+05:30

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధం కోసం అమలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధం కోసం అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం సమయంలో వీధుల్లో తిరిగే పశువుల మేత కోసం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిధులు మంజూరు చేశారు. 


ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, వీథుల్లో తిరిగే వీధి కుక్కలు, పశువులకు ఆహారం అందించడం కోసం సీఎం సహాయ నిధి నుంచి రూ.67.52 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధుల్లో భువనేశ్వర్ నగర పాలక సంస్థ రోజుకు రూ.20 వేలు ఖర్చు చేయవచ్చు. మరొక నాలుగు నగర పాలక సంస్థలు రోజుకు రూ.10 వేలు చొప్పున ఖర్చు చేయవచ్చు. 48 పురపాలక సంఘాలు రోజుకు రూ.5 వేలు చొప్పున; 61 నోటిఫైడ్ ఏరియా కౌన్సిళ్ళు రోజుకు రూ.2,000 చొప్పున ఖర్చు చేయవచ్చు. 


నవీన్ పట్నాయక్ ఈ కార్యక్రమం కోసం ఈ ఏడాది రెండు విడతల్లో  రూ.1,13,94,000 విడుదల చేశారు. దీనికి అదనంగా గురువారం రూ.67.52 లక్షలు మంజూరు చేశారు.


Updated Date - 2021-06-04T01:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising