ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Auto, Taxi డ్రైవర్లకు శుభవార్త!

ABN, First Publish Date - 2021-05-04T18:46:02+05:30

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దేశ రాజధాని నగరం ఢిల్లీ రాష్ట్రంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దేశ రాజధాని నగరం ఢిల్లీ రాష్ట్రంలోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు కష్టకాలంలో అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. రెండు నెలలపాటు ప్రతి నెలా రూ.5,000 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుంచి వీరంతా గట్టెక్కేందుకు ఈ ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. 


ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఆటో రిక్షాలు, ట్యాక్సీల డ్రైవర్లందరికీ నెలకు రూ.5,000 చొప్పున రెండు నెలలపాటు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. ఈ ఆర్థిక సంక్షోభం సమయంలో వారికి చేదోడువాదోడుగా ఉండాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అదేవిధంగా ఢిల్లీలోని 72 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ సరుకులను రెండు నెలలపాటు అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 


ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ రెండు నెలలపాటు కొనసాగుతుందని భావించవద్దని కేజ్రీవాల్ ప్రజలను కోరారు. పరిస్థితి మెరుగుపడుతుందని, లాక్‌డౌన్ అవసరం ఉండదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 


కోవిడ్-19 రెండో ప్రభంజనం నేపథ్యంలో మే 10 వరకు ఢిల్లీలో అష్ట దిగ్బంధనం విధించిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-05-04T18:46:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising