ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనాపై వరాల జల్లు

ABN, First Publish Date - 2021-08-12T22:41:00+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత బాక్సర్ లవ్లీనా బోర్గోహాయిన్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువాహటి : టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత బాక్సర్ లవ్లీనా బోర్గోహాయిన్‌కు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అనేక వరాలు ప్రకటించారు. డీఎస్‌పీ ఉద్యోగం ఇవ్వడంతోపాటు గువాహటిలోని ఓ రోడ్డుకు ఆమె పేరు పెడతామని చెప్పారు. ఆమె స్వస్థలం గోలాఘాట్‌లో ఓ స్టేడియాన్ని నిర్మించి, ఆమె పేరు పెడతామన్నారు. ఆమెకు శిక్షణ ఇచ్చిన కోచ్‌కు రూ.10 లక్షలు చెల్లిస్తామన్నారు. 



లవ్లీనాకు గువాహటి విమానాశ్రయంలో హిమంత బిశ్వ శర్మ గురువారం స్వాగతం పలికారు. శర్మ ఇచ్చిన ట్వీట్‌లో, తాను ఎంతో గర్వంతో, ఆనందంతో స్టార్ ఒలింపియన్ మెడలిస్ట్ లవ్లీనా బోర్గోహాయిన్‌కు స్వాగతం పలికానని తెలిపారు. ఆమె ఒలింపిక్స్‌లో విజయం సాధించి, లక్షలాది మంది కలలను ప్రేరేపించారని పేర్కొన్నారు. క్రీడా రంగంలోని గ్రామీణ ప్రతిభావంతులకు ఆమె ఉదాహరణగా నిలిచారన్నారు. ప్రపంచ వేదికపై భారీ విజయాలు సాధించాలన్న ఆకాంక్షలను ఏర్పరచుకోవడానికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. 


Updated Date - 2021-08-12T22:41:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising