ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-12-23T16:21:40+05:30

బెళగావిలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ప్రముఖ నటుడు ‘ముఖ్యమంత్రి చంద్రు’ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నటుడు ‘ముఖ్యమంత్రి చంద్రు’

బెంగళూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బెళగావిలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ప్రముఖ నటుడు ‘ముఖ్యమంత్రి చంద్రు’ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మరాఠా అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసినప్పటి నుంచి బెళగావిలో కొన్ని శక్తులు చెలరేగిపోతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. ఈ బో ర్డును తాత్కాలికంగా నిలిపేయాలని, ఆరాచకాలకు ఊతమిస్తున్న మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎ్‌స)పై నిషేధం విధించాలన్నారు. బెళగావి ఘటనలకు నిరసనగా నాటక రంగం, సినీరంగ కళాకారులంతా మూకుమ్మడిగా పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.  డాక్టర్‌ రాజ్‌కుమార్‌, అంబరీ్‌షలు ఉన్నంతవరకు కళాకారుల సంఘం క్రియాశీలకంగా ఉండేదన్నారు. ప్రభుత్వం సినీకళాకారుల సంఘం కోసం భవనం కూడా ఏర్పాటు చేసిందని గుర్తుచేసిన ఆయన ఈ సదుపాయాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. కన్నడ భాష, నేల, జలాల విషయంలో అన్యాయం జరుగుతూంటే చూస్తూ సహించేది లేదని ఆ యన స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-23T16:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising