ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నైట్‌కర్ఫ్యూ ఆలోచన లేదు

ABN, First Publish Date - 2021-12-10T16:49:50+05:30

రాష్ట్రంలో రెండు ఒమైక్రాన్‌ కేసులు నమోదైన తర్వాత ఎటువంటి నిబంధనలు అమలులోకి వస్తాయనే అంశమై సాగుతున్న చర్చలకు తెరపడింది. ప్రస్తుతానికి బెంగళూరు సహా రాష్ట్రంలో ఎక్కడా నైట్‌ కర్ఫ్యూ కానీ వీకెండ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                         - నర్సింగ్‌ విద్యార్థులకు రెండు డోసులు తప్పనిసరి: CM బొమ్మై


బెంగళూరు: రాష్ట్రంలో రెండు ఒమైక్రాన్‌ కేసులు నమోదైన తర్వాత ఎటువంటి నిబంధనలు అమలులోకి వస్తాయనే అంశమై సాగుతున్న చర్చలకు తెరపడింది. ప్రస్తుతానికి బెంగళూరు సహా రాష్ట్రంలో ఎక్కడా నైట్‌ కర్ఫ్యూ కానీ వీకెండ్‌ నిబంధనలు అమలు చేసే అలోచన కానీ లేదని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తేల్చి చెప్పారు. గురువారం ఉదయం కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ నిపుణులతో ఆయన సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రివర్గ భేటీలో నిర్ణయాలను సీఎం బొమ్మై మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని నర్సింగ్‌ కళాశాలలోను విద్యార్థులకు రెండు డోసుల వ్యాక్సిన్‌ తప్పనిసరి చేశామన్నారు. క్రిస్‌మస్‌, కొత్త సంవత్సర వేడుకల అమలుపై మరో వారం రోజుల తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. అప్పటి పరిస్థితిని బట్టి మరోసారి నిపుణుల సలహాల ప్రకారం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. క్రిస్‌మస్‌, కొత్తసంవత్సర వేడుకలపై ఎటువంటి ఆంక్షలు ఉండాలనేందుకు నిపుణులతో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో ఒమైక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ పట్ల భయపడాల్సిన పనిలేదని, కానీ ముందస్తుగా జాగ్రత్తలకు మార్గదర్శకాలు పాటించాల్సిందే అన్నారు. హాస్టళ్లలో భోజనాలకు విద్యార్థులు విడతలవారిగా ఏర్పాటుతో పాటు రెండుడోసులు సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యేలా తీర్మానించారు. హాస్టళ్లు, క్లస్టర్‌లలో ప్రత్యేక మార్గదర్శకాలు ఉంటాయన్నారు. అయితే వైద్యఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ సభకు గైర్హాజరు కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Updated Date - 2021-12-10T16:49:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising