ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేఆర్‌ఎస్‌, కబిని రిజర్వాయర్లకు సీఎం వాయనం

ABN, First Publish Date - 2021-11-03T16:56:05+05:30

భారీ వర్షాలతో జలకళను సంతరించుకున్న కృష్ణరాజసాగర్‌, కబిని రిజర్వాయర్లకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మంగళవారం సంప్రదాయమైన వాయనం సమర్పించారు. అనంతరం ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు(Karnataka): భారీ వర్షాలతో జలకళను సంతరించుకున్న కృష్ణరాజసాగర్‌, కబిని రిజర్వాయర్లకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మంగళవారం సంప్రదాయమైన వాయనం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాలతో వ్యవసాయ కార్యకలాపాలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయని ఈసారి పంటల దిగుబడి ఆశాదాయకంగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నానన్నారు. తొలుత మైసూరు జిల్లాలోని హెచ్‌డీకోట తాలూకా బీచనహళ్ళి గ్రామం వద్ద కబిని రిజర్వాయర్‌కు వాయనం సమర్పించిన సీఎం అనంతరం మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకాలోని కృష్ణరాజసాగర్‌ డ్యామ్‌కు వాయనం సమర్పించారు. సంప్రదాయమైన పూజలతో వాయనం సమర్పించారు. సీఎంతోపాటు జలవనరులశాఖ మంత్రి గోవింద కారజోళ, సహకారశాఖ మంత్రి ఎస్‌టీ సోమశేఖర్‌ హాజరయ్యారు. రెండు రిజర్వాయర్‌లకు వాయనం సమర్పించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని సీఎం పేర్కొన్నారు.

Updated Date - 2021-11-03T16:56:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising