ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఎన్‌యూలో ఏబీవీపీ, ఏఐఎస్ఏ మధ్య గొడవ.. గాయపడ్డ విద్యార్థులు

ABN, First Publish Date - 2021-11-15T17:56:04+05:30

ఈ విషయమై డీసీపీ గౌరవ్ శర్మ మాట్లాడుతూ ‘‘యూనివర్సిటీలో ఇరు వర్గాలు గొడవ పడుతున్నట్లు, ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేస్తున్నట్లు వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న జవహార్‌లాల్ యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి సంఘానికి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్‌కి మధ్య ఆదివారం రాత్రి జరిగిన గొడవలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థుల్ని ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది. ఆదివారం రాత్రి 9:45 గంటలకు ఇరు విద్యార్థి నేతల మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు.


ఈ విషయమై డీసీపీ గౌరవ్ శర్మ మాట్లాడుతూ ‘‘యూనివర్సిటీలో ఇరు వర్గాలు గొడవ పడుతున్నట్లు, ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేస్తున్నట్లు వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా పరిస్థితులు ప్రశాంతంగానే కనిపించాయి. అయితే యూనివర్సిటీలో జరిగిన గొడవపై దర్యాప్తు చేస్తున్నాం’’ అని అన్నారు. అయితే ఈ విషయమై జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, అయితే లెఫ్ట్, ఏబీవీపీ విద్యార్థులు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేశారని పోలీసులు తెలిపారు.



Updated Date - 2021-11-15T17:56:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising