ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా యుద్ధ విమానాన్ని కూల్చేసినట్లు India చెప్పుకోవడం నిరాధారం : Pakistan

ABN, First Publish Date - 2021-11-23T21:47:11+05:30

వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ 2019 ఫిబ్రవరి 27న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్ : వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ 2019 ఫిబ్రవరి 27న పాకిస్థానీ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేసినట్లు భారత్ చెప్తున్న మాటలకు ఎటువంటి ఆధారాలు లేవని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంగళవారం తెలిపింది. అభినందన్‌కు వీర చక్ర పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. 


అభినందన్ వర్ధమాన్ ప్రస్తుతం భారత వాయు సేనలో గ్రూప్ కెప్టెన్‌గా చేస్తున్నారు. 2019 ఫిబ్రవరి 26 తెల్లవారుజామున భారత వాయు సేన (ఐఏఎఫ్) పాకిస్థాన్‌, ఖైబర్ పష్తూన్‌ఖ్వా, బాలాకోట్‌లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ శిబిరాలపై వైమానిక దాడులు జరిపింది. అంతకుముందు ఉగ్రవాదులు మన దేశంలోని పుల్వామాలో దాడి చేసినందుకు ప్రతీకారంగా ఈ వైమానిక దాడులు జరిగాయి. ఫిబ్రవరి 27న పాకిస్థాన్ వైమానిక దళం ప్రతీకార దాడులు చేసింది. ఈ సమయంలో  అభినందన్ వర్ధమాన్ పాకిస్థానీ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేశారు. ఆ తర్వాత ఆయన నడుపుతున్న మిగ్-21 బైసన్ విమానం పాక్ దాడికి గురైంది.ఆయనను పాకిస్థానీ సైన్యం పట్టుకుని, మార్చి 1 రాత్రి విడుదల చేసింది. ఆయన ప్రదర్శించిన ధైర్య, సాహసాలు, శౌర్య, పరాక్రమాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు వీర చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసింది. విధి నిర్వహణలో అసాధారణ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించినందుకు గౌరవించింది. యుద్దంలో శౌర్యపరాక్రమాలను ప్రదర్శించినవారికి ఇచ్చే మూడు అత్యున్నత స్థాయి పురస్కారాలు వరుసగా పరమ వీర చక్ర, మహా వీర చక్ర, వీర చక్ర. 


2019 ఫిబ్రవరి 27న పాకిస్థానీ ఎఫ్-16 యుద్ధ విమానమేదీ కూలిపోలేదని అంతర్జాతీయ నిపుణులు, అమెరికన్ అధికారులు స్పష్టం చేశారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం మంగళవారం తెలిపింది. పాకిస్థానీ ఎఫ్-16ల వివరాలను పరిశీలించి, ఈ విధంగా ధ్రువీకరించారని పేర్కొంది. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోందని, అందుకు సజీవ సాక్ష్యం భారత దేశ పైలట్ అభినందన్‌ను విడుదల చేయడమని తెలిపింది. భారత దేశం మాత్రం శత్రుత్వంతో వ్యవహరిస్తోందని, దురుద్దేశపూర్వకంగా దూకుడుగా చర్యలు తీసుకుంటోందని ఆరోపించింది.


Updated Date - 2021-11-23T21:47:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising