నటుడు విజయ్ విశ్వకు ‘గౌరవ డాక్టరేట్’
ABN, First Publish Date - 2021-10-07T15:58:37+05:30
కోలీవుడ్ నటుడు విజయ్ విశ్వకు గౌరవ డాక్టరేట్ లభించింది. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు విస్తృతంగా సేవ చేసినందుకు గుర్తింపుగా ఆయనకు ఈ గౌరవ డాక్టరేట్‌ను ఇంటర్నేషనల్ పీస్
అడయార్(చెన్నై): కోలీవుడ్ నటుడు విజయ్ విశ్వకు గౌరవ డాక్టరేట్ లభించింది. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు విస్తృతంగా సేవ చేసినందుకు గుర్తింపుగా ఆయనకు ఈ గౌరవ డాక్టరేట్‌ను ఇంటర్నేషనల్ పీస్ తమిళ్ యూనివర్శిటీ తాజాగా అందజేసింది. ఈ గౌరవ డాక్టరేట్‌ను నటుడు విజయ్ విశ్వ చెన్నై జిల్లా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వైద్యలింగం చేతులమీదుగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమలం గ్రూపు సంస్థల అధినేత జేకే ముత్తు, మంగైయక్కరసి ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కార్తికేయన్, ఏకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే, రోటరీ సంఘం రాష్ట్ర స్థాయి గౌరవ సభ్యుడుగా విజయ్ విశ్వను ఇటీవల నియమించిన విషయం తెల్సిందే.
Updated Date - 2021-10-07T15:58:37+05:30 IST