ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేజస్వీ, చిరాగ్ సమావేశం.. బిహార్‌లో కొత్త పొత్తు?

ABN, First Publish Date - 2021-09-08T23:02:13+05:30

మా తండ్రి చనిపోయి ఏడాది కావస్తోంది. దీని గుర్తుగా సెప్టెంబర్ 12న ఓ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఆ కార్యక్రమానికి తేజస్వీని ఆహ్వానించాను. రేపు ఢిల్లీకి వెళ్లి లాలూ ప్రసాద్ యాదవ్‌ను కూడా కలుస్తాను. మా నాన్నతో పని చేసిన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: బిహార్‌లో ఇద్దరు యువనేతల సమావేశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్, లోక్‌జన్‌శక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్‌లు బుధవారం సమావేశమయ్యారు. వీరి సమావేశంపై అనేక వార్తలు వస్తున్నప్పటికీ.. తన తండ్రి సంవత్సరీకం సందర్భంగా తేజస్వీని పిలవడానికి వచ్చినట్లు చిరాగ్ తెలిపారు. అయితే ఆర్జేడీ-ఎల్జేపీ మధ్య పొత్తు కుదరనుందని పుకార్లు వినిపిస్తున్నాయి. గతంలో ఓ సందర్భంలో ఆర్జేడీ-ఎల్జేపీ మధ్య పొత్తు అవసరం ఉందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ వ్యాఖ్యానించడంతో తాజా ఊహాగాణాలకు బలం చేకూరింది.


కాగా, తేజస్వీతో సమావేశం అంనతరం మీడియాతో చిరాగ్ మాట్లాడుతూ ‘‘మా తండ్రి చనిపోయి ఏడాది కావస్తోంది. దీని గుర్తుగా సెప్టెంబర్ 12న ఓ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఆ కార్యక్రమానికి తేజస్వీని ఆహ్వానించాను. రేపు ఢిల్లీకి వెళ్లి లాలూ ప్రసాద్ యాదవ్‌ను కూడా కలుస్తాను. మా నాన్నతో పని చేసిన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాను. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ని కూడా ఆహ్వానిస్తాను’’ అని అన్నారు. అయితే ఇరు పార్టీల మధ్య పొత్తుపై చిరాగ్ స్పందించలేదు కానీ, తేజస్వీ మాత్రం స్పందించారు. ‘‘ఏం చెప్పాలో లాలూజీ చెప్పారు. అంతకు మించి మేం స్పందించలేము’’ అని అన్నారు.

Updated Date - 2021-09-08T23:02:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising