ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లడఖ్‌కు ఆధునిక ఆయుధాలను తరలిస్తున్న చైనా

ABN, First Publish Date - 2021-08-10T21:56:00+05:30

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) తీరు అంతుబట్టడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) తీరు అంతుబట్టడం లేదు. గాల్వన్ ఏరియా, పాంగాంగ్ సో ఇరు తీరాల నుంచి తన దళాలను ఉపసంహరించుకుంది. తాజాగా గోగ్రా నుంచి దళాలు వెనుకకు వెళ్తున్నాయి. మరోవైపు తూర్పు లడఖ్ ప్రాంతానికి అత్యాధునిక ఆయుధాలను పీఎల్ఏ తరలిస్తోంది. సెల్ఫ్ ప్రొపెల్డ్ మోర్టార్స్, పీహెచ్ఎల్-03 లాంగ్ రేంజ్ మల్టిపుల్ రాకెట్ లాంఛర్స్ వంటివాటిని ఇక్కడికి చేర్చుతోంది. 


అంతకుముందు టైప్-15 లైట్ బ్యాటిల్ ట్యాంక్స్, జెడ్‌టీజెడ్-99 మెయిన్ బ్యాటిల్ ట్యాంక్, పాత తరం జెడ్‌టీజెడ్-88లను తూర్పు లడఖ్ ప్రాంతానికి తీసుకొచ్చింది. పాంగాంగ్‌లో దాదాపు 100 చైనీస్ ట్యాంకులు ఉన్నాయి. జెడ్-8 హెలికాప్టర్లు, పెద్ద ఎత్తున నిఘా పరికరాలు కనిపిస్తున్నాయి. 


భారత్, చైనా సైనిక కమాండర్ల స్థాయిలో ఇప్పటి వరకు 12 విడతల్లో చర్చలు జరిగాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  వర్చువల్ డయలాగ్స్ నిర్వహించాయి. హాట్ స్ప్రింగ్స్, డెప్సాంగ్ ప్రాంతాల నుంచి దళాల ఉపసంహరణ ఇంకా జరగలేదు. 


పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరుకు సమీపంలో ఉన్న జింజియాంగ్ రీజియన్‌లో ఓ ఆర్టిలరీ యూనిట్‌ను పీఎల్ఏ మోహరించింది. దీనిలో లాంగ్ రేంజ్ పీహెచ్ఎల్-03 రాకెట్ లాంఛర్స్‌ ఉన్నాయి. 


Updated Date - 2021-08-10T21:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising