ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Taiwan పై తిరుగాడుతున్న Chinese యుద్ధ విమానాలు

ABN, First Publish Date - 2021-10-03T22:59:42+05:30

తైవాన్ గగనతలంలోకి శనివారం 39 చైనా యుద్ధ విమానాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తైపేయి : తైవాన్ గగనతలంలోకి శనివారం 39 చైనా యుద్ధ విమానాలు ప్రవేశించాయి. శుక్రవారం 38 యుద్ధ విమానాలు ప్రవేశించాయి. స్వయంపాలిత దీవి అయిన తైవాన్ ఈ సంఘటనలను తీవ్రంగా ఖండించింది. అయితే తైవాన్ తమదేనని చైనా చెప్తోంది. 1949లో జరిగిన అంతర్యుద్ధం నేపథ్యంలో చైనా, తైవాన్ విడిపోయాయి. మెయిన్ లాండ్ చైనాను కమ్యూనిస్టులు, తైవాన్‌ను నేషనలిస్టులు పరిపాలిస్తున్నారు. 


తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం,  తైవాన్ గగనతల రక్షణ గుర్తింపు ప్రాంతంలోకి శనివారం మొత్తం మీద 39 చైనా యుద్ధ విమానాలు ప్రవేశించాయి. పగలు 20, రాత్రి 19 యుద్ధ విమానాలు ప్రవేశించాయి. శుక్రవారం 38 యుద్ద విమానాలు ప్రవేశించాయి. తైవాన్ ప్రీమియర్ సు త్సెంగ్-చాంగ్ శనివారం దక్షిణ తైవాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, శుక్రవారం చైనా విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించడాన్ని ఖండించారు. ప్రాంతీయ ప్రశాంతతకు భంగం కలిగించేందుకు చైనా నిరంతరం క్రూరమైన, ఆటవిక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. 


ఇదిలావుండగా, దాదాపు ఓ సంవత్సరం నుంచి చైనా తరచూ తన యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపిస్తోంది. 


Updated Date - 2021-10-03T22:59:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising