ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తైవాన్ వేరే దేశం కాదు’ జపాన్‌పై చైనా ఫైర్

ABN, First Publish Date - 2021-06-10T23:40:03+05:30

తైవాన్‌ను ఓ దేశంగా పేర్కొన్నందుకుగానూ జపాన్ ప్రధాని యోషిహిడే సుగాపై చైనా మండిపడింది. తైవాన్ వేరే దేశం కాదని, అది తమ దేశంలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: తైవాన్‌ను ఓ దేశంగా పేర్కొన్నందుకుగానూ జపాన్ ప్రధాని యోషిహిడే సుగాపై చైనా మండిపడింది. తైవాన్ వేరే దేశం కాదని, అది తమ దేశంలో అంతర్భాగమని, ఇలాంటి వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. జపాన్ ప్రధాని వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని గురువారం నిరసన వ్యక్తం చేసింది.


జపాన్‌లో ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ప్రపంచంలోని కరోనా పరిస్థితులపై చర్చించారు. అందులో భాగంగా జపాన్ ప్రధాని యోషిహిడే సుగా మాట్లాడుతూ.. తైవాన్‌ను ఓ దేశంగా పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, తైవాన్ దేశాలు కరోనా కట్టడిలో అద్భుత విజయం సాధించాయని పేర్కొన్నారు.


ఈ వ్యాఖ్యలపైనే చైనా నిప్పులు చెరిగింది.  చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ స్పందిస్తూ.. జపాన్ ప్రధాని వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలను దెబ్బతీసేలా ఉన్నాయని, తైవాన్‌ను దేశంగా పరిగణించకూడదన్న ఒప్పందాన్ని జపాన్ ఉల్లంఘించిందని పేర్కొన్నారు.

Updated Date - 2021-06-10T23:40:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising