చైనా వ్యాక్సిన్ అత్యంత ప్రమాదకరం!
ABN, First Publish Date - 2021-01-09T08:08:58+05:30
చైనా ప్రభుత్వ ఆధీనంలోని సైనోఫాం సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదని ఆ దేశానికే చెందిన
ఆ దేశ వైద్యనిపుణుడి వ్యాఖ్యలు
బీజింగ్, జనవరి 8: చైనా ప్రభుత్వ ఆధీనంలోని సైనోఫాం సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదని ఆ దేశానికే చెందిన టావో లినా అనే వైద్యనిపుణుడు వ్యాఖ్యానించారు. దీని ద్వారా 73 రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని, ప్రపంచంలో మరే టీకా కూడా ఇంత ప్రమాదకరం కాదని తెలిపారు.
చైనాలోని ట్విటర్ లాంటి ప్లాట్‌ఫాం ‘వెబో’లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపాయి. విదేశీ మీడియా.. దీనికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో.. ఆయన వెంటనే మాట మార్చేశారు. విదేశీ మీడియా తన మాటలను వక్రీకరించిందని చెప్పుకొచ్చారు. తాను కూడా పదాల ఎంపికలో జాగ్రత్త వహించి ఉంటే బాగుండేదని అన్నారు. దేశ ప్రజలను క్షమాపణ కోరారు.
Updated Date - 2021-01-09T08:08:58+05:30 IST