ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరుణాచల్ యువకులపై ‘డ్రాగన్’ కన్ను!

ABN, First Publish Date - 2021-08-14T14:54:03+05:30

భారత్‌తో తరచూ కయ్యానికి కాలుదువ్వుతున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌తో తరచూ కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా ఇప్పుడు మరో కుట్రకు వ్యూహం పన్నింది. మన దేశంలోని అరుణాచల్‌ సరిహద్దుల్లోని 1126 కిలోమీటర్ల ప్రాంతం టిబెట్‌ను ఆనుకునివుంది. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా... దక్షిణ టిబెట్‌లో భాగమని చెబుతుంటుంది. దీనిని భారత్‌లో భాగమని ఒప్పుకునేందుకు ఎంతమాత్రం అంగీకరించదు. గత ఏడాది గల్వాన్ ఘాటీ‌లో జరిగిన ఘర్షణల అనంతరం చైనా... అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో పలు నిర్మాణాలను మొదలుపెట్టింది. డ్యామ్ మొదలుకొని హైవే, రైల్వే లైన్లను నిర్మించింది. 


తాజాగా మన దేశ సరిహద్దుల్లోని యువకులను తమ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. దీని గురించి కాంగ్రెస్ మాజీ ఎంపీ నిగోంగ్ ఈరింగ్ మాట్లాడుతూ   అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లోని యువకులను తమ పీఎల్ఏ‌లో చేర్చుకునేందుకు చైనా సర్కారు ప్రయత్నిస్తుదని తెలిపారు. దీని గురించి సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసిన ఆయన టిబెట్‌కు చెందిన యువకులను కూడా చైనా తన సైన్యంలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. దీనిని మన కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. 


Updated Date - 2021-08-14T14:54:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising