ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరుణాచల్‌పై Twitter పోస్ట్‌లతో చైనా బెదిరింపులు

ABN, First Publish Date - 2021-11-08T22:04:45+05:30

లధాఖ్, అరుణాచల్ సరిహద్దులో ఉన్న చైనా సైనికులు ఈ పోస్ట్‌లు పెట్టినట్టు సమాచారం. గత కొద్ది రోజులుగా టిబెట్‌లో చైనా సైనికులు పెద్ద ఎత్తున విన్యాసాలు చేస్తున్నారు. దీంతో భారత సరిహద్దును కట్టుదిట్టం చేశారు. ఇక చైనా సైనికులు ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున పెట్టిన పోస్టులను భారత అధికారులు పర్యవేక్షిస్తున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: డ్రాగన్ దేశం మళ్లీ కవ్వింపులకు దిగుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌‌పై మిలిటరీ యాక్షన్ బెదిరింపులు చేస్తామంటూ చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడతోంది. పీఎల్ఏకు చెందిన వెరిఫికేషన్ ఉన్న కొందరు, వెరిఫికేషన్‌లేని వారు సోషల్ మీడియాలో బెదిరింపు పోస్టులు పెడుతున్నారు. ఓ జాతీయ దినపత్రిక పేర్కొన్న ప్రకారం.. ట్విట్టర్‌లో పీఎల్‌ఏకు చెందిన వారు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. ఇందులో అరుణాచల్ ప్రదేశ్‌పై దాడికి సంకేతాలు ఇస్తున్నట్లు ఉందని, ఇండియాకు పరోక్షంగా బెదిరింపులు చేస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవానికి చైనాలో ట్విట్టర్ నిశేషిద జాబితాలో ఉంది. అయితే లధాఖ్, అరుణాచల్ సరిహద్దులో ఉన్న చైనా సైనికులు ఈ పోస్ట్‌లు పెట్టినట్టు సమాచారం. గత కొద్ది రోజులుగా టిబెట్‌లో చైనా సైనికులు పెద్ద ఎత్తున విన్యాసాలు చేస్తున్నారు. దీంతో భారత సరిహద్దును కట్టుదిట్టం చేశారు. ఇక చైనా సైనికులు ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున పెట్టిన పోస్టులను భారత అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2021-11-08T22:04:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising