ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాలిబన్లతో స్నేహానికి సిద్ధమే.. చైనా కీలక వ్యాఖ్య

ABN, First Publish Date - 2021-08-16T20:50:27+05:30

తాలిబన్లకు తొలి నుంచీ మద్దతిస్తున్న పాకిస్థాన్, పాక్ మిత్రదేశమైన చైనా ఏం చేయబోతున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో అఫ్ఘాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత తొలిసారిగా చైనా స్పందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: అఫ్ఘానిస్థాన్ తాలిబన్ల హస్తగతమైంది. దీంతో..ఆ దేశ భవిష్యత్తుపై, అక్కడి మహిళలు, మైనారిటీల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు.. తాలిబన్ల ప్రభుత్వాన్ని ఎవరూ గుర్తించకూడదని బ్రిటన్ ప్రధాని తాజాగా అభిలషించారు. ప్రజస్వామ్య దేశాలన్నీ దాదాపుగా ఇదే పంథాను ఎంచుకున్నాయి. ఇక తాలిబన్లకు తొలి నుంచీ మద్దతిస్తున్న పాకిస్థాన్, పాక్ మిత్రదేశమైన చైనా ఏం చేయబోతున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  


అఫ్ఘానిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత తొలిసారిగా చైనా స్పందించింది. తాలిబన్లతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకోవాలన్న అఫ్ఘాన్ ప్రజల హక్కును చైనా గౌరవిస్తోంది. ఆ దేశంతో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అంటూ విదేశాంగ శాఖ ప్రతినిధి తాజాగా వ్యాఖ్యానించారు.  

Updated Date - 2021-08-16T20:50:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising