ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

China: భారీవర్షాలు..బ్లూ అలర్ట్ జారీ

ABN, First Publish Date - 2021-08-26T12:46:44+05:30

చైనా దేశంలోని ఏడు ప్రావిన్సులలో విస్తారంగా భారీవర్షాలు కురుస్తున్నండటంతో చైనా జాతీయ వాతావరణ కేంద్రం గురువారం బ్లూ అలర్ట్ జారీ చేసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ (చైనా): చైనా దేశంలోని ఏడు ప్రావిన్సులలో విస్తారంగా భారీవర్షాలు కురుస్తున్నండటంతో చైనా జాతీయ వాతావరణ కేంద్రం గురువారం బ్లూ అలర్ట్ జారీ చేసింది. భారీవర్షాలు గురువారం రాత్రి 8 గంటల వరకు కురిసే అవకాశం ఉండటంతో బ్లూ అలర్ట్ ను జారీ చేశారు.చైనా దేశంలో భారీవర్షాల నేపథ్యంలో వరదల తీవ్రతను బట్టి రెడ్, ఆరంజ్, ఎల్లో, బ్లూ అలర్ట్ లను వాతావరణ శాఖ జారీ చేస్తోంది.సిచౌన్, చోంగ్ కింగ్, గుజీహౌ, హుబై, హేనన్, యున్నన్, షాన్సీ ప్రావిన్సులతోపాటు టిబెట్, మంగోలియా ప్రాంతాల్లో గురువారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని చైనా వాతావరణ కేంద్రం వెల్లడించింది. 


ఉరుములు, మెరుపులతోకూడిన భారీవర్షాలు కురుస్తుండటంతో చైనాలో ప్రజల జనజీవనం స్తంభించి పోయింది. గంటకు 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చోంగ్ కింగ్ మున్సిపాలిటీలో 150 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సెంట్రల్ చైనాలో కొండచరియలు విరిగి పడటంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీవర్షాల వల్ల ముందుజాగ్రత్తగా జెంగ్ జెహో, హేనన్ ప్రాంతాల్లో  బ్రిడ్జీలు, టన్నెల్స్ ను మూసివేశారు. హేనన్ లో గత నెలలో సంభవించిన వరదల్లో 300 మందికి పైగా మరణించారు.హేనన్, షాన్సీ, సిచైన్ ప్రాంతాల్లో భారీవర్షాల వల్ల 25 జాతీయ రహదారులను మూసివేశారు.

Updated Date - 2021-08-26T12:46:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising