ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాలో మంకీ వైరస్ బాధితుడు మృతి!

ABN, First Publish Date - 2021-07-22T17:52:15+05:30

కరోనా కల్లోలం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: కరోనా కల్లోలం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో చైనాలో మరో వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ బారినపడిన బాధితుడు మృత్యువాత పడ్డాడు. చైనాలో మంకీ బీ వైరస్ బారినపడిన ఒక పశువైద్యుడు మృతి చెందాడు. మంకీ వైరస్ బారిపడిన వ్యక్తి మృతి చెందడం ఇది తొలిసారి. కాగా ఈ వైరస్ బారినపడినవారు మృత్యువాత పడేందుకు 70 నుంచి 80శాతం వరకూ అవకాశాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 


మీడియాకు అందిన సమాచారం ప్రకారం బీజింగ్‌కు చెందిన 53 ఏళ్ల పశువైద్యుడు మంకీ బీ వైరస్ బారిన పడ్డాడు. తరువాత పలు ఆసుపత్రులలో చికిత్స పొందాడు. అయినా ఫలితం లేకపోయింది. కాగా ఆ వైద్యునితో టచ్‌లో ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో ఎవరికీ వైరస్ సోకలేదని తేలింది. కాగా మంకీ వైరస్ గురించి ఐసీఎంఆర్ మాజీ కన్సల్టెంట్ డాక్టర్ వీకే భరద్వాజ మాట్లాడుతూ మంకీ వైరస్ మనుషుల్లో అతి అరుదుగా కనిపిస్తుందని, భారత్‌లో ఈ వైరస్ ఇప్పటివరకూ కనిపించలేదని అన్నారు. అయితే ఈ వైరస్ మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని అన్నారు. ఇది కోతుల ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపారు.

Updated Date - 2021-07-22T17:52:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising