ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒప్పందాల ఉల్లంఘనకు చైనా జవాబు చెప్పాలి : జైశంకర్

ABN, First Publish Date - 2021-11-19T20:32:51+05:30

భారత్-చైనా మధ్య సంబంధాలు గతుకుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత్-చైనా మధ్య సంబంధాలు గతుకుల రహదారిలో ఉన్నాయని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అన్నారు. ఒప్పందాలను ఉల్లంఘిస్తూ కొన్ని చర్యలను చైనా చేపట్టిందని, అందుకు ఆ దేశం వద్ద ఇప్పటికీ విశ్వసనీయమైన వివరణ లేదని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నదీ చైనా నాయకత్వమే చెప్పాలన్నారు. 


సింగపూర్‌లో జరిగిన ‘‘గ్రేటర్ పవర్ కాంపిటీషన్ : ది ఎమర్జింగ్ వరల్డ్ ఆర్డర్’’ చర్చా కార్యక్రమంలో ఓ ప్రశ్నకు సమాధానంగా జైశంకర్ మాట్లాడుతూ, భారత్-చైనా సంబంధాల్లో ప్రస్తుత పరిస్థితి గురించి చైనా నాయకత్వానికి ఏదైనా సందేహం ఉన్నట్లు తాను భావించడం లేదని చెప్పారు. తన వల్ల సక్రమంగా జరగనిది ఏమిటో కూడా ఆ దేశ నాయకత్వానికి తెలుసునని తెలిపారు. తాను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతోఅనేకసార్లు సమావేశమయ్యానని తెలిపారు. తాను అత్యంత స్పష్టంగా, సమంజసంగా మాట్లాడానని చెప్పారు. అటువైపు నుంచి స్పష్టత లేదన్నారు. 


తూర్పు లడఖ్‌లో చైనాతో ఘర్షణలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, భారత్-చైనా మధ్య అమలవుతున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా కొన్ని చర్యలు చేపట్టినందువల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు గతుకుల రహదారిలో నడుస్తున్నాయని చెప్పారు. ఈ ఉల్లంఘనలకు ఇప్పటికీ చైనా వద్ద సరైన, విశ్వసనీయమైన వివరణ లేదన్నారు. 


తూర్పు లడఖ్‌లో భారత్-చైనా ఘర్షణలు గత ఏడాది మే 5న ప్రారంభమయ్యాయి. గత ఏడాది జూన్ 15న గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికులు తలపడ్డారు. ఇరు దేశాలు క్రమంగా తమ సైనిక, ఆయుధ సామర్థ్యాలను పెద్ద ఎత్తున మోహరించాయి. అనేక దఫాల చర్చల అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాల సైన్యాలు పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల నుంచి వెనుకకు వెళ్ళాయి. ఇరు దేశాలు గోగ్రా ప్రాంతం నుంచి తమ సైన్యాలను ఆగస్టులో ఉపసంహరించుకున్నాయి. 


Updated Date - 2021-11-19T20:32:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising