ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత సరిహద్దు వెంట 100 రాకెట్లు లాంఛర్లు మోహరించిన చైనా

ABN, First Publish Date - 2021-10-20T23:32:23+05:30

ఇక భారత్‌ కూడా సరిహద్దుపై దృష్టి సారించింది. భారీ సంఖ్యలో రాడార్లు, సెన్సార్లు, కెమెరాలు, మోషన్ డిటెక్టర్లను భారత్ ఏర్పాటు చేసింది. అంతేకాదు, ఉపగ్రహాల నుంచి సేకరించిన చిత్రాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటోంది. దీంతో ఎల్‌ఏసీ, చైనా భూభాగంలో పీఎల్‌ఏ కదలికలను స్పష్టంగా తెలుసుకోవచ్చు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా మరోసారి కవ్వింపు చర్యలు దిగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా భారత సరిహద్దు వెంబడి 100 అత్యాధునిక దీర్ఘశ్రేణి రాకెట్ లాంఛర్లను చైనా మోహరించింది. ఈ విషయాన్ని చైనా సైనిక వర్గాలు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వద్ద ధ్రువీకరించాయి. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన వివాదంపై 13వ విడత సైనిక కమాండర్ల స్థాయి చర్చలు విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా సరిహద్దులో భారతీయ ఆయుధాలను తరలిస్తోందనే అనుమానాలు వస్తున్నాయి. అయితే తమ జవాన్లు అతిశీతల వాతావరణానికి అలవాడు పడాలనే కారణంతో ఇలా చేస్తున్నట్లు చైనా చెప్పుకురావడం గమనార్హం.


ఇక భారత్‌ కూడా సరిహద్దుపై దృష్టి సారించింది. భారీ సంఖ్యలో రాడార్లు, సెన్సార్లు, కెమెరాలు, మోషన్ డిటెక్టర్లను భారత్ ఏర్పాటు చేసింది. అంతేకాదు, ఉపగ్రహాల నుంచి సేకరించిన చిత్రాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటోంది. దీంతో ఎల్‌ఏసీ, చైనా భూభాగంలో పీఎల్‌ఏ కదలికలను స్పష్టంగా తెలుసుకోవచ్చు. అత్యంత కీలకమైన సాఫ్ట్‌వేర్‌ను భారత్ అభివృద్ధి చేసింది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ సాఫ్ట్‌వేర్‌ చైనా సైనికులను గుర్తించగలదు. చాలా కాలంగా సరిహద్దుల్లో చైనా సైనికుల కదలికలు చిత్రీకరించిన వీడియోల డేటాబేస్ వాడి దీనిని అభివృద్ధి చేశారు.

Updated Date - 2021-10-20T23:32:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising