ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా దౌత్యవేత్తలకు మలద్వార పరీక్షలు.. తోసిపుచ్చిన చైనా..

ABN, First Publish Date - 2021-02-25T23:33:39+05:30

అమెరికా దౌత్యవేత్తలకు కరోనా నిర్ధారణ కోసం మలద్వార పరీక్షలు చేస్తున్నట్టు వస్తున్న ఆరోపణలను చైనా ఖండించింది. తమ సిబ్బందిలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: అమెరికా దౌత్యవేత్తలకు కరోనా నిర్ధారణ కోసం మలద్వార పరీక్షలు చేస్తున్నట్టు వస్తున్న ఆరోపణలను చైనా ఖండించింది. తమ సిబ్బందిలో కొందరికి ఈ తరహా పరీక్షలు చేస్తున్నారంటూ వాషింగ్టన్ మీడియాలో కథనాలు వెలువడడంతో డ్రాగన్ ఈ మేరకు స్పందించింది. ‘‘చైనాలోని అమెరికా దౌత్యాధికారులను మలద్వార పరీక్షలు చేయించుకోవాలంటూ చైనా ఎప్పుడూ అడగలేదు...’’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ పేర్కొన్నారు. కాగా అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఇవాళ వాషింగ్టన్‌‌లో మాట్లాడుతూ.. ‘‘అమెరికా దౌత్యవేత్తలు, వారి కుటుంబాల భద్రత, రక్షణకు మేము కట్టుబడి ఉన్నాం. దౌత్య సంబంధాలపై వియన్నా ఒప్పందం సహా ఇతర దౌత్య చట్టాల ప్రకారం దౌత్య సిబ్బంది గౌరవాన్ని కాపాడుతాం...’’ అని పేర్కొన్నారు. కాగా చైనాలో తమకు మలద్వారం గుండా కొవిడ్-19 పరీక్షలు చేస్తున్నారంటూ అమెరికా సిబ్బంది విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్టు గత వారం వాషింగ్టన్ పోస్ట్ పత్రిక పేర్కొంది. ముక్కు, నోటిలోని స్వాబ్‌ల కంటే ఈ ప్రక్రియ ద్వారానే మరింత కచ్చితమైన ఫలితాలు వస్తాయని చెబుతున్న నేపథ్యంలో చైనా ఈ విధానాన్ని అవలంబిస్తున్నట్టు సమాచారం. 

Updated Date - 2021-02-25T23:33:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising