ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్‌కు భారీ అత్యాధునిక War Shipను ఇచ్చిన చైనా

ABN, First Publish Date - 2021-11-09T23:31:48+05:30

పాకిస్థాన్‌కు భారీ, అత్యంత ఆధునిక యుద్ధ నౌకను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ : పాకిస్థాన్‌కు భారీ, అత్యంత ఆధునిక యుద్ధ నౌకను చైనా అందజేసింది. చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ దీనిని డిజైన్ చేసి, నిర్మించింది. దీనిని షాంఘైలో జరిగిన జల ప్రవేశ కార్యక్రమంలో పాకిస్థాన్ నేవీకి అప్పగించినట్లు ఈ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంత అత్యాధునిక యుద్ధ నౌకను విదేశాలకు అందజేయడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. అరేబియా, హిందూ మహా సముద్రాల్లో పాక్ నేవీ బలం పెరగాలని చైనా కోరుకుంటున్న సంగతి తెలిసిందే. 


టైప్ 054ఏ/పీ రకానికి చెందిన ఈ యుద్ద నౌకకు పీఎన్ఎస్ టుఘ్రిల్ అని పేరు పెట్టినట్లు గ్లోబల్ టైమ్స్ మంగళవారం వెల్లడించింది. చైనాకు పాకిస్థాన్ రాయబారి మొయిన్ ఉల్ హక్ మాట్లాడుతూ, హిందూ మహా సముద్రంలో బలాల సమతుల్యతకు పీఎన్ఎస్ టుఘ్రిల్ దోహదపడుతుందన్నారు. ఈ ప్రాంతంలో భద్రత విషయంలో టుఘ్రిల్ క్లాస్ యుద్ధ నౌకలు పాకిస్థాన్ నావికా దళ సామర్థ్యాన్ని పెంచుతాయన్నారు. హిందూ మహా సముద్రంలో ఎదురయ్యే సవాళ్ళు, సముద్ర రక్షణ, శాంతి, సుస్థిరతలను  కాపాడటానికి ఉపయోగపడుతుందని చెప్పారు. 


పాకిస్థాన్ నావికా దళం విడుదల చేసిన ప్రకటనలో, ఇటువంటి యుద్ధ నౌకలు నాలుగింటిని పాకిస్థాన్ కోసం చైనా తయారు చేస్తున్నట్లు తెలిపింది. వీటిలో మొదటిది ఇప్పుడు పాకిస్థాన్ నావికా దళానికి అందినట్లు తెలిపింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి, ఉపరితలం నుంచి గగనతలానికి, సముద్రంలోపలి జలాల్లో దాడులు చేసే సత్తా దీనికి ఉందని పేర్కొంది. దీనికి విస్త‌‌ృత నిఘా సామర్థ్యం ఉందని వివరించింది.


Updated Date - 2021-11-09T23:31:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising