ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దు ఉద్రిక్తతలు సద్దుమణిగాయి..చైనా ప్రకటన

ABN, First Publish Date - 2021-07-16T03:09:43+05:30

భారత్ చైనా సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు సద్దుమణిగాయని చైనా తాజాగా ప్రకటించింది. వాస్తవాధీన రేఖ వివాదాన్ని ఇరు దేశాలు పక్కన పెట్టి ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించాలని కూడా అభిప్రాయపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్ చైనా సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు సద్దుమణిగాయని చైనా తాజాగా ప్రకటించింది. వాస్తవాధీన రేఖ వివాదాన్ని ఇరు దేశాలు పక్కన పెట్టి ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించాలని కూడా అభిప్రాయపడింది. షాంఘాయ్ కొఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాల సందర్భంగా బుధవారం నాడు ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు సమావేశమైన విషయం తెలిసిందే. దీనిపై చైనా విదేశాంగ శాఖ కార్యాలయం గురువారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది రష్యా రాజధాని మాస్కోలో తాను అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో సమావేశమైన తరువాత సరిహద్దు వద్ద ఉద్రికత్తలు తగ్గాయని, గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు నుంచి ఇరు దేశాల సైన్యాలు వెనక్కుతగ్గాయని ఈ ప్రకటనలో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు.  అంతేకాకుండా.. స్థూలంగా చూస్తే ఉద్రిక్తతలు తగ్గాయని ఆయన వ్యాఖ్యానించారు.   

Updated Date - 2021-07-16T03:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising