ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌పై చైనా సైబర్ దాడి.. రిపోర్టులపై డ్రాగన్ కంట్రీ విమర్శలు!

ABN, First Publish Date - 2021-03-02T05:39:33+05:30

ముంబై మహానగరంలో గతేడాది జరిగిన పవర్ ఔటేజి చైనా సైబర్ దాడేనని వచ్చిన రిపోర్టులపై డ్రాగన్ కంట్రీ మండిపడింది. అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఇచ్చిన ఈ నివేదికను చైనా విదేశాంగ శాఖ తప్పుబట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: ముంబై మహానగరంలో గతేడాది జరిగిన పవర్ ఔటేజి చైనా సైబర్ దాడేనని వచ్చిన రిపోర్టులపై డ్రాగన్ కంట్రీ మండిపడింది. అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఇచ్చిన ఈ నివేదికను చైనా విదేశాంగ శాఖ తప్పుబట్టింది. సరిహద్దుల్లో భారత్, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలోనే డ్రాగన్ కంట్రీ ఇండియాపై సైబర్ దాడి చేసిందని ఈ నివేదిక పేర్కొంది. భారత్‌లోని పవర్ గ్రిడ్లపై చైనా ఈ ఎటాక్ చేసినట్లు తెలిపింది. వీటిపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.. ఈ నివేదికలను పూర్తి బాధ్యతారాహిత్యంగా అభివర్థఇంచారు. ‘‘సైబర్ దాడులపై చైనా వైఖరి స్పష్టంగా ఉంది. ఇలాంటి దాడులకు మేము పూర్తిగా వ్యతిరేకం. ఈ విషయంలో ఎటువంటి ఊహాగానాలకూ తావు లేదు’’ అని చైనా విదేశాంగ శాఖ స్పష్టంచేసింది.

Updated Date - 2021-03-02T05:39:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising