ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓ అంతరిక్ష కేంద్రం.. చైనా సొంతం!

ABN, First Publish Date - 2021-09-18T07:58:39+05:30

చైనా.. ఓ అంతరిక్ష కేంద్రానికి అధిపతి కానుం ది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా రికార్డులకెక్కనుంది. ఈ దేశం తలపెట్టిన అంతరిక్ష కేంద్ర నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 90 రోజుల్లో నిర్మించి భూమిని చేరిన వ్యోమగాములు

బీజింగ్‌, సెప్టెంబరు 17: చైనా.. ఓ అంతరిక్ష కేంద్రానికి అధిపతి కానుం ది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా రికార్డులకెక్కనుంది. ఈ దేశం తలపెట్టిన అంతరిక్ష కేంద్ర నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి.  జూన్‌లో రోదసిలోకి వెళ్లి 90 రోజుల పాటు అక్కడే ఉండి, పనులు పూర్తి చేసుకొని  శుక్రవారం మధ్యాహ్నం వారు తిరిగి వచ్చారు. ఈ మేరకు చైనా మేన్డ్‌ స్పేస్‌ ఏజెన్సీ (సీఎంఎ్‌సఏ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.  అంతరిక్ష కేంద్ర  వచ్చే ఏడాదికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని పేర్కొంది. వ్యోమగాములు నీయ్‌ హైషెంగ్‌, లియు బోమింగ్‌, టాంగ్‌ హాంగ్బోలతో కూడిన షేంగ్జూ-12 వ్యోమనౌక ఉత్తర చైనాలోని ఇన్నర్‌ మంగోలియన్‌ అటానమస్‌ రీజియన్‌కు చెందిన డాంగ్‌ ఫెంగ్‌ ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30కి దిగింది. ఈ వ్యోమనౌక భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇందుకు సంబంధించిన వివరాలను చైనా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వచ్చింది. క్షేమంగా భూమికి చేరిన వెంటనే.. ఈ మిషన్‌ విజయవంతమైందని ప్రకటించింది. 


Updated Date - 2021-09-18T07:58:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising