ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనవరి 3 నుంచే పిల్లలకు వ్యాక్సిన్‌

ABN, First Publish Date - 2021-12-27T18:48:58+05:30

దేశవ్యాప్తంగా పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విధంగానే జనవరి 3 నుంచి వ్యాప్తంగా శ్రీకారం చుడతామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. బెంగళూరులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                - వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌


బెంగళూరు: దేశవ్యాప్తంగా పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విధంగానే జనవరి 3 నుంచి వ్యాప్తంగా శ్రీకారం చుడతామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. బెంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 15- 18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోను మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15-18 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు సుమారు 43 లక్షల మంది ఉన్నారన్నారు. వారందరికీ వ్యాక్సిన్‌ వేస్తామన్నారు. రాష్ట్రంలో తొలిడోసు వ్యాక్సిన్‌ 98 శాతం సాధ్యమైందన్నారు. రాష్ట్రమంతటా వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తీ చేస్తామన్నారు. రెండో డోసు 75 శాతం సాధ్యమయిందన్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు గడిచిన నెలరోజులతో పోల్చితే కొంత మేర పెరుగుతున్నాయన్నారు. దీనికి తోడు ఒమైక్రాన్‌ ప్రభావం కూడా తోడవ్వడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో ఒమైక్రాన్‌ ప్రభావం పెరిగే అవకాశం ఉందని వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారన్నారు.

Updated Date - 2021-12-27T18:48:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising