ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో వాయుకాలుష్యంపై కేజ్రీవాల్ అత్యవసర సమావేశం

ABN, First Publish Date - 2021-11-13T20:10:30+05:30

దేశ రాజధానిలో వాయు కాలుష్య తీవ్రతపై పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకునేందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్య తీవ్రతపై పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్, పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్‌తో చీఫ్ సెక్రటరీ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) సలహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.


ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యతపై సుప్రీంకోర్టు శనివారం ఉదయం తీవ్ర ఆక్షేపణ తెలిపింది. అవసరమైతే రెండు రోజులు లాక్‌డౌన్ విధించే ఆలోచన చేయాలనే సూచించింది. అలాగే వ్యర్థ పదార్ధాలను తగులబెట్టే మిషన్లను రైతులకు ఎందుకు అందించరాదని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాన్ని సీజేఐ ఎన్‌వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం ప్రశ్నించింది. రెండ్రోజులు లాక్‌డౌన్ విధిస్తారా, ఇంకేమైనా చేస్తారా, ప్రజలు ఎలా బతకాలి? అని నిలదీసింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Updated Date - 2021-11-13T20:10:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising