ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు జోలికొస్తే ఖబడ్దార్‌...

ABN, First Publish Date - 2021-09-18T15:48:25+05:30

చంద్రబాబు జోలికొస్తే ఎవరికైనా పుట్టగతులుండవని చెన్నై టీడీపీ ఇన్‌చార్జ్‌ చంద్రశేఖర్‌ హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌, వైసీపీ గూండాల దుశ్చ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: చంద్రబాబు జోలికొస్తే ఎవరికైనా పుట్టగతులుండవని చెన్నై టీడీపీ ఇన్‌చార్జ్‌ చంద్రశేఖర్‌ హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌, వైసీపీ గూండాల దుశ్చర్యని ఆయన తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన స్థానిక అన్నానగర్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో శాంతిభద్రతలు కాపాడలేని విఫల ప్రభుత్వం కొనసాగుతోందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతపై వైసీపీ గూండాలు దాడి చేస్తుంటే ప్రభుత్వం, పోలీస్‌శాఖ చోద్యం చూస్తున్నాయంటే అక్కడ శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ఇట్టే అర్థమవుతుందన్నారు. తమ నాయకుడు క్రమశిక్షణ నేర్పించారు కాబట్టి వైసీపీ గూండాలు ఇంకా రోడ్లపై తిరగగలుగుతున్నారన్నారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తల క్రమశిక్షణను చేతగానితనం అనుకోవద్దని హెచ్చరించారు. తాము తిరగబడితే వైసీపీ గూండాలు తట్టుకోలేరన్నారు. ‘‘మా నాయకుడిపైనే దాడికి తెగబడతారా? ఇక సహించేది లేదు. మా సత్తా ఏంటో చూపిస్తాం. జోగీ రమేష్‌! నువ్వు జోకర్‌వి. మీకు మంత్రి పదవి కావాలంటే జగన్‌రెడ్డి బాత్రూంలు కడుగు. మా నాయకుడివైపు చూశావంటే నల్లిని నలిపినట్లు నలుపుతాం. మీరంతా ఆడే డ్రామాలు ప్రజలు గమనిస్తూనేవున్నారు. అతి త్వరలోనే మీ పతనం ఖాయం’’ అంటూ చంద్రశేఖర్‌ హెచ్చరించారు.


పక్క రాష్ట్రాలే నివ్వెరపోతున్నాయ్‌ : మహేంద్ర బాబు 

చంద్రబాబుపై ఇంటిపై జరిగిన దాడిని చెన్నై టీడీపీ ఫోరం ప్రెసిడెంట్‌ మహేంద్ర బాబు గడ్డం ఖండించారు. ముఖ్యమంత్రి జగన్‌, ఆయన మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు పోలీసుల అండతో టీడీపీ నేతలను, కార్యకర్తలను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిం చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలుగు ప్రజల కోసం చెమట చిందించిన టీడీపీ కార్యకర్తలు నేడు నెత్తురు కార్చారు. పసుపుజెండాకి అంటుకున్న రక్తపు మరకలకు జవాబు చెప్పాల్సిన రోజు దగ్గరలో వుంది. ముఖ్యమంత్రి పరోక్ష ఆదేశాలతో పోలీసుల అండదండలతో ప్రతిపక్ష నేత ఇంటిపైకి రాళ్లదాడి చేయించిన ఘటన చూసి పక్క రాష్ట్రాలు నివ్వెరపోతున్నాయి. ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లు పట్టుకున్న అల్లరి మూకల కు సాక్షాత్తు శాసనసభ్యులే నేతృత్వం వహించడం సిగ్గుచేటు. వైసీపీ పాలనలో ప్రజలు ప్రశాంతంగా గడిపిన రోజు లేదు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనకు టీడీపీ నేతలు కొవ్వొత్తులను, ప్లకార్డులను వినియోగిస్తుంటే వైసీపీ నేతలు మాత్రం ఇనుపరాడ్లు, కర్రలు, రాళ్లను ఉపయోగిస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడికి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీ నామా చేయాలి. దాడికి నేతృత్వం వహించిన జోగి రమేష్‌ను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని మహేంద్ర డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-09-18T15:48:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising