ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నై నిపుణుడికి మైక్రోసాప్ట్ భారీ బహుమానం!

ABN, First Publish Date - 2021-03-05T03:42:44+05:30

మైక్రోసాఫ్ట్ వ్యవస్థలో ఉన్న లోపాన్ని గుర్తించి సంస్థకు సమాచారం అందించిన చెన్నై నిపుణుడికి ఆ సంస్థ రూ. 36 లక్షల రూపాలయను బహుమానంగా ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: మైక్రోసాఫ్ట్ వ్యవస్థలో ఉన్న లోపాన్ని గుర్తించి సంస్థకు సమాచారం అందించిన చెన్నై నిపుణుడికి ఆ సంస్థ 36 లక్షల రూపాలయను బహుమానంగా ఇచ్చింది. చెన్నైకి చెందిన పరిశోధకుడు లక్ష్మణ్ ముత్తయ్య ఈ లోపాన్ని గుర్తించాడు. దీని ఆసరాతో ఎవరైనా సరే ఎటువంటి అనుమతులు లేకుండా మైక్రోసాఫ్ట్ అకౌంట్లను తమ స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్‌లోని ఈ లోపాన్ని తాను ఎలా గుర్తించిందీ తన బ్లాగ్‌లో సవివరంగా పేర్కొన్నారు. కాగా.. ముత్తయ్య గుర్తించిన  లోపాన్ని మైక్రోసాఫ్ట్ వెంటనే సవరించింది. ఇది తమ దృష్టికి తెచ్చినందుకు ఆయనకు  బగ్ బౌంటీ ప్రోగ్రామ్ కింద రూ. 36 లక్షల రూపాయల భారీ నజరానా ఇచ్చింది. తమ సాఫ్ట‌వేర్‌లోని లోపాలను గుర్తించేందుకు ప్రముఖ టెక్ సంస్థలను ఇటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తుంటాయి. లోపాలు గుర్తించిన వారికి భారీ బహుమానాలు ఇస్తుంటాయి. గతంలో పేస్‌బుక్ కూడా అనేక మందికి ఇటువంటి నజరానాలనున ప్రకటించింది. 

Updated Date - 2021-03-05T03:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising