ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో ఆవిరి యంత్రాలు

ABN, First Publish Date - 2021-05-17T17:15:51+05:30

సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఆవిరి యంత్రాలను మిగిలిన రైల్వేస్టేషన్‌లోనూ ఏర్పాటుచేయనున్నట్లు రైల్వే ఎస్పీ పళనికుమార్‌ తెలిపారు. రాష్ట్రంలో రోజురోజుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/పెరంబూర్: సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఆవిరి యంత్రాలను మిగిలిన రైల్వేస్టేషన్‌లోనూ ఏర్పాటుచేయనున్నట్లు రైల్వే ఎస్పీ పళనికుమార్‌ తెలిపారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా తీవ్రరూపం దాల్చ డంతో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించారు. దీంతో, ఉపాధి కోసం రాష్ట్రానికొచ్చిన ఉత్తరాది కార్మికులు తమ స్వరాష్ట్రాలకు పయనమవుతుండడంతో  సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ కిటకిటలాడుతోంది. దీంతో, కరోనా ప్రబలే అవకాశముందనే వైద్యనిపుణుల హెచ్చరికతో రైల్వే పోలీసులు కరోనా నియంత్రణ చర్యలు చేపట్టారు. రైల్వేస్టేషన్‌లో ఏర్పాటుచేసిన 10 ఆవిరి పట్టే యంత్రాలు ఎస్సీ పళనికుమార్‌ ప్రారంభించారు. వేపాకు, తులసి, పసుపు, కర్పూరం తదితర మిశ్రమాన్ని యంత్రాల ద్వారా ఆవిరి రూపంలో వెలువడుతుందని, స్టేషన్‌లో ఉన్న ఉత్తరాది కార్మికులు, ప్రయాణికులు, రైల్వే సిబ్బంది అందరూ ఈ యంత్రం ద్వారా ఆవిరి పట్టే అవకాశముందన్నారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, త్వరలో మరిన్ని రైల్వేస్టేషన్లలో ఈ సౌకర్యం  కల్పించనునట్లు ఎస్పీ పళనికుమార్‌ తెలిపారు.

Updated Date - 2021-05-17T17:15:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising